తెలంగాణలో సగం మంది ఉపాధ్యాయుల బదిలీలకు బ్రేక్
స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) తెలుగు, హిందీ, ఉర్దూ ఉపాధ్యాయులతోపాటు ఫిజికల్ డైరెక్టర్(పీడీ)ల బదిలీలకు బ్రేక్ పడింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 వేల మంది ఉపాధ్యాయుల బదిలీ జరగాల్సి ఉండగా సగం వరకు నిలిచిపోయాయి.
ఈనాడు, హైదరాబాద్: స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) తెలుగు, హిందీ, ఉర్దూ ఉపాధ్యాయులతోపాటు ఫిజికల్ డైరెక్టర్(పీడీ)ల బదిలీలకు బ్రేక్ పడింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 వేల మంది ఉపాధ్యాయుల బదిలీ జరగాల్సి ఉండగా సగం వరకు నిలిచిపోయాయి. భాషా పండితులు, పీడీ పోస్టుల ఉన్నతీకరణ, పదోన్నతులను ఎస్జీటీలను కలుపుకొని ఉమ్మడి సీనియారిటీ ఆధారంగా చేపట్టాలని ఇటీవల హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో బదిలీలు జరిగితే మారుమూల గ్రామాల్లో టీచర్లు ఉండరని కొందరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో అధికారులు వాటిని నిలిపివేయాలని, మిగిలిన ఎస్‌ఏలకు సోమవారం రాత్రి బదిలీ ఉత్తర్వులు ఇవ్వాలని డీఈఓలను పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు ఆదేశించారు. పాఠశాలలో ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే ఉంటే తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రిలీవ్ చేయవద్దని, ఇద్దరున్నచోట సీనియర్‌ను బదిలీపై పంపి జూనియర్‌ను అక్కడే కొనసాగించాలని సూచించారు. తమకు బదిలీ అయితే దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందన్న ఉద్దేశంతో రంగారెడ్డి జిల్లాకు చెందిన కొందరు ఉపాధ్యాయులు ఈ ప్రక్రియ నిలిపేసేలా చక్రం తిప్పినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
liquor: తక్కువ ధరకు మద్యం అమ్మితే రూ.4 లక్షల జరిమానా
ఓ వైపు తెలంగాణ ఎన్నికల పోలింగ్ సమీపిస్తోంది.. మరోవైపు ఎక్సైజ్ పాలసీ(మద్యం విధానం) గడువు ముంచుకొస్తోంది. -
ఇదీ సంగతి!
-
తిరుమలకు ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి తిరుమల చేరుకున్నారు. ఆయన సోమవారం శ్రీవారిని దర్శించుకోనున్నారు. -
విశ్వ మిత్ర దేశంగా భారత్
దేశీయ సంస్థలు ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్లను మనం ప్రపంచ దేశాలకు అందించి కొవిడ్ మహమ్మారిని తరిమికొట్టేందుకు అండగా నిలబడిన విధానంతో భారత్ విశ్వ మిత్రగా మారిపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. -
శ్రీశైలంలో వైభవంగా జ్వాలా తోరణోత్సవం
శ్రీశైల మహాక్షేత్రంలో కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం జ్వాలా తోరణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. -
యాదాద్రిలో ఎనిమిది విడతల సత్యనారాయణ వ్రతం నేడు
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో కార్తిక పౌర్ణమి సందర్భంగా సోమవారం(27న) సత్యనారాయణస్వామి సామూహిక వ్రతాలు ఎనిమిది విడతలుగా నిర్వహించనున్నారు. -
1.68 లక్షల పోస్టల్ బ్యాలెట్ల ఆమోదం
‘‘రాష్ట్రంలో 1,68,612 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు ఆమోదం పొందారు. వీరిలో ఇప్పటివరకు 96,526 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
రాజ్యాంగం ఆమోదించిన పాలకులు న్యాయకోవిదులే
ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే న్యాయ వ్యవస్థ, రాజ్యాంగం పటిష్ఠంగా ఉండాలని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి అన్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Chelluboyina Venugopal: మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌కు గుండె నొప్పి
-
Supreme Court: వాలంటీర్ వ్యవస్థతో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు కుట్ర: సిటిజన్ ఫర్ డెమోక్రసీ
-
IPL-2024: ఐపీఎల్లో ఆడాలని ఉంది: పాకిస్థాన్ బౌలర్
-
Social Look: నీటితో సమస్యలకు చెక్ అన్న అదా.. మీనాక్షి స్ట్రీట్ షాపింగ్
-
Gautam Singhania: కంపెనీ కార్యకలాపాలు యథాతథం.. వాటాదారులు, ఉద్యోగులకు గౌతమ్ సింఘానియా లేఖ
-
Lokesh Kanagaraj: కొత్త ప్రయాణం మొదలుపెట్టిన లోకేశ్ కనగరాజ్.. ఫస్ట్ ఛాన్స్ వారికే