ఉపాధ్యాయ దంపతుల మౌన దీక్ష.. అరెస్టు

వేర్వేరు జిల్లాల్లోని పాఠశాలల్లో పనిచేస్తున్న తమను ఒకే జిల్లాకు బదిలీ చేయాలంటూ గాంధీ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దంపతులు మౌనదీక్షకు దిగారు.

Published : 03 Oct 2023 02:58 IST

డీఎస్‌ఈ కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: వేర్వేరు జిల్లాల్లోని పాఠశాలల్లో పనిచేస్తున్న తమను ఒకే జిల్లాకు బదిలీ చేయాలంటూ గాంధీ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దంపతులు మౌనదీక్షకు దిగారు. సోమవారం 13 జిల్లాల నుంచి స్పౌజ్‌ ఫోరం ఆధ్వర్యంలో తరలివచ్చిన ఉపాధ్యాయ దంపతులు హైదరాబాద్‌ లక్డీకాపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ (డీఎస్‌ఈ) కార్యాలయం ఎదుట వారి పిల్లలతో మౌన నిరసన దీక్ష చేపట్టారు. దీక్షలో బైఠాయించిన ఉపాధ్యాయ దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, ఉపాధ్యాయులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుని స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉపాధ్యాయ మహిళలు, వారి పిల్లలు కన్నీరు పెట్టుకున్నారు. ఉపాధ్యాయ దంపతులు మాట్లాడుతూ.. శాంతియుతంగా దీక్షకు దిగిన తమను పోలీసులు ఈడ్చుకెళ్లి వాహనాల్లో పడేశారని ఆరోపించారు. గాంధీ వేషధారణలో ఉన్న ఓ బాలుడిని  తండ్రితోపాటు వాహనంలోకి ఎక్కించారు. అరెస్టు చేసిన వారిని వివిధ ఠాణాలకు తరలించి సాయంత్రం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు