ఎస్సీ వర్గీకరణ వెంటనే చేపట్టండి

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను వెంటనే చేపట్టాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాను ఎమ్మార్పీఎస్‌ కోరింది. ఈ మేరకు సోమవారం దిల్లీలో ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, మాదిగ ఉద్యోగులు.

Published : 03 Oct 2023 02:58 IST

కేంద్ర మంత్రి అమిత్‌షాకు ఎమ్మార్పీఎస్‌ వినతి

ఈనాడు, దిల్లీ: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను వెంటనే చేపట్టాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాను ఎమ్మార్పీఎస్‌ కోరింది. ఈ మేరకు సోమవారం దిల్లీలో ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, మాదిగ ఉద్యోగులు, న్యాయవాదుల సమాఖ్య నాయకులు కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెదేపా ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లపాటు వర్గీకరణ అమలై దాని ఫలాలు కనిపించాయని, తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికొచ్చిందని వాపోయారు. అనంతరం మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణపై తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఈ నెల 7న జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ నుంచి మాదిగ విశ్వరూప పాదయాత్ర ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని