తెలంగాణ పల్లెల్లో గాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం

వ్యవసాయం, సాగునీటిరంగాల అభివృద్ధి, పునరుజ్జీవం పొందిన కులవృత్తులు, బలోపేతమైన గ్రామీణ ఆర్థికాభివృద్ధి, ఆసరా అందుకుంటున్న పేదలు, పెద్దల చిరునవ్వులతో గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యానికి తెలంగాణ పల్లెలు ప్రతిరూపాలుగా నిలుస్తున్నాయని సీఎం కేసీఆర్‌ అన్నారు.

Updated : 03 Oct 2023 05:45 IST

మహాత్ముడికి సీఎం కేసీఆర్‌ నివాళి

ఈనాడు, హైదరాబాద్‌: వ్యవసాయం, సాగునీటిరంగాల అభివృద్ధి, పునరుజ్జీవం పొందిన కులవృత్తులు, బలోపేతమైన గ్రామీణ ఆర్థికాభివృద్ధి, ఆసరా అందుకుంటున్న పేదలు, పెద్దల చిరునవ్వులతో గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యానికి తెలంగాణ పల్లెలు ప్రతిరూపాలుగా నిలుస్తున్నాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని సీఎం కేసీఆర్‌ సోమవారం నివాళులర్పించారు. ‘సత్యమేవ జయతే’ అనే విశ్వాసం ప్రేరణగా, దేశ ప్రజలకు గాంధీజీ అందించిన విజయాల స్ఫూర్తి.. తెలంగాణ రాష్ట్ర సాధనలో, స్వరాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో ఇమిడి ఉందని కేసీఆర్‌ తెలిపారు.


గాంధీ మార్గంలోనే కేసీఆర్‌

-గుత్తా

మహాత్మాగాంధీ చూపించిన అహింసా మార్గాన్నే అనుసరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమాన్ని విజయతీరాలకు చేర్చారని శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శాసనసభ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి సోమవారం ఆయన పూలమాలవేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఛైర్మన్‌ బండా ప్రకాశ్‌, మండలి విప్‌ ఎం.ఎస్‌.ప్రభాకర్‌రావు, ఎమ్మెల్సీ దయానంద్‌, శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు, భారాస శాసనసభాపక్ష కార్యదర్శి రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని