సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమే!

వయస్సుతో ప్రమేయం లేకుండా జీవితంలో సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమేనని, దీనికి బిట్స్‌ పిలానీ వర్క్‌ ఇంటిగ్రేటెడ్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్స్‌ విద్యార్థులే నిదర్శనమని సైయెంట్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌, బోర్డు సభ్యుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి అన్నారు.

Published : 20 Nov 2023 03:29 IST

పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి
బిట్స్‌ స్నాతకోత్సవంలో 7,514 మందికి పట్టాల అందజేత

శామీర్‌పేట, న్యూస్‌టుడే: వయస్సుతో ప్రమేయం లేకుండా జీవితంలో సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమేనని, దీనికి బిట్స్‌ పిలానీ వర్క్‌ ఇంటిగ్రేటెడ్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్స్‌ విద్యార్థులే నిదర్శనమని సైయెంట్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌, బోర్డు సభ్యుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (బిట్స్‌) పిలానీ హైదరాబాద్‌ క్యాంపస్‌లో నిర్వహించిన వర్క్‌ ఇంటిగ్రేటెడ్‌ లెర్నింగ్‌ ప్రోగామ్స్‌ కోర్సులో ఉత్తీర్ణులైన విద్యార్థుల స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఓవైపు సంస్థల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే బిట్స్‌ పిలానీ అందిస్తున్న వర్క్‌ ఇంటిగ్రేటెడ్‌ లెర్నింగ్‌ కార్యక్రమంలో చేరి పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేయడం అభినందనీయమన్నారు.

బిట్స్‌ పిలానీ కులపతి పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత ఆచార్య కుమార మంగళం బిర్లా పంపిన సందేశాన్ని ఆ విద్యాసంస్థ ఉప కులపతి ఆచార్య వి.రాంగోపాల్‌ స్నాతకోత్సవంలో చదివి వినిపించారు. ఈ సందర్భంగా 7,514 మందికి పట్టాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఐటీ, ఐటీఈఎస్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, బీఎఫ్‌ఎస్‌ఐ, ఫార్మా అండ్‌ హెల్త్‌కేర్‌, ఆటోమోటివ్‌ ఎనర్జీ రంగాల డైనమిక్‌ అవసరాలను తీర్చడంలో బిట్స్‌ అందిస్తున్న సేవలను వివరించారు. ఈ కోర్సుల్లో నేర్చుకున్న అంశాలను తమకు సహకరించిన సంస్థలకు ప్రయోజనం చేకూరేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. బిట్స్‌ పిలానీ హైదరాబాద్‌ క్యాంపస్‌ డైరెక్టర్‌ ఆచార్య జి.సుందర్‌ మాట్లాడుతూ.. 43 ఏళ్లుగా 1.14 లక్షల మంది వర్కింగ్‌   ప్రొఫెషనల్స్‌ ఇక్కడ అందిస్తున్న వర్క్‌ ఇంటిగ్రేటెడ్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్స్‌ కోర్సులను ఉపయోగించుకున్నారని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని