మా అమ్మను చూసి చాలా నేర్చుకున్నా
‘‘మా నాన్న ప్రజా జీవితంలో ఉండటం వల్ల మాతో గడిపేది తక్కువ సమయం. మా అమ్మని చూసి చాలా నేర్చుకున్నా. నా భార్యకు కూడా ఓర్పు ఎక్కువ. నా చెల్లి చాలా డైనమిక్.
నా చెల్లి చాలా డైనమిక్
వివిధ రంగాలకు చెందిన మహిళలతో భేటీలో మంత్రి కేటీఆర్
అతివలకు అతి తక్కువ వడ్డీకి రుణాలిస్తామని వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: ‘‘మా నాన్న ప్రజా జీవితంలో ఉండటం వల్ల మాతో గడిపేది తక్కువ సమయం. మా అమ్మని చూసి చాలా నేర్చుకున్నా. నా భార్యకు కూడా ఓర్పు ఎక్కువ. నా చెల్లి చాలా డైనమిక్. మా కుటుంబంలో తనంత ధైర్యవంతులు లేరు. నా కుమార్తె చిన్న వయసులోనే చాలా బాగా ఆలోచిస్తుంది. కుమార్తె పుట్టాక నా జీవితం చాలా మారింది. హైదరాబాద్ నుంచి వచ్చిన క్రీడాకారుల్లో ఎక్కువ మంది మహిళలే. కొవిడ్ వంటి క్లిష్ట సమయాల్లో సుచిత్ర ఎల్ల, మహిమా దాట్ల వంటి వారు గొప్ప అండగా నిలిచారు. మహిళలు మానసికంగా చాలా బలంగా ఉంటారు’’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ‘భవిష్యత్ తెలంగాణలో మహిళలు’ అంశంపై వైద్యులు, పాత్రికేయులు, పారిశ్రామికవేత్తలు, సినిమా తదితర రంగాలకు చెందిన మహిళలతో కేటీఆర్ ఆదివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ‘‘కేసీఆర్ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రాగానే అతివలకు అతి తక్కువ వడ్డీకి రుణాలిస్తాం. డిసెంబరు 15 లోపు మహిళల కోసం ప్రత్యేకంగా ఒక ఎజెండా మీరే తయారు చేయండి. మళ్లీ అధికారంలోకి రాగానే చర్చించి అమలు చేద్దాం’’ అని పేర్కొన్నారు.
మహిళల అభ్యున్నతికి ఎన్నో చేశాం.. ఇంకా చేయాలి..
మహిళల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా కేటీఆర్ వివరించారు. ‘‘ప్రతి ఇంటికి మంచినీళ్లు అందించాం. మైనారిటీ పిల్లల కోసం ప్రత్యేక పాఠశాలలు ప్రారంభించాం. ప్రతి చిన్నారిపై రూ.10 వేలకు పైగా ఖర్చు చేస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేశాం. ఫలితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 30 నుంచి 61 శాతానికి పెరిగాయి. కేసీఆర్ కిట్ అమలు చేయడం వల్ల ప్రసూతి మరణాలను తగ్గించగలిగాం. స్త్రీనిధి కింద స్వయంసహాయక సంఘాల మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నాం. అలా రుణాలు పొందిన మహిళల్లో 99 శాతం తిరిగి చెల్లిస్తున్నారు. తీసుకున్న రుణాలతో మహిళలు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించి విజయాలు సాధిస్తుండడం సంతోషాన్నిస్తోంది. స్త్రీల కోసం కేసీఆర్ ప్రభుత్వం మహిళా విశ్వవిద్యాలయం, కల్యాణలక్ష్మి, అమ్మఒడి వంటివి అందుబాటులోకి తీసుకొచ్చింది. సుల్తాన్‌పూర్, నందిగామ సహా మొత్తం 4 చోట్ల ప్రత్యేకంగా మహిళల కోసం పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేశాం. రక్షణపరంగా ఇప్పటికే షీ టీమ్స్, టోల్‌ఫ్రీ నంబరు లాంటివి తీసుకొచ్చాం. మహిళల సమస్యల కోసం ప్రత్యేకంగా ఒక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. వారు తమ వివరాలు చెప్పకుండానే ఫిర్యాదు చేయొచ్చు. వాళ్ల హక్కుల గురించి తెలుసుకోవచ్చు. మానసిక ఒత్తిడి, ఆందోళనలకు కౌన్సెలింగ్ అందిస్తారు. మహిళల కోసం మరిన్ని చేయాల్సి ఉంది. రూ.400కి గ్యాస్ సిలిండర్‌ను ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. నెగెటివ్ బ్లడ్‌గ్రూప్ ఉన్న మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురానున్నాం. చదువుకున్న మహిళలు రాజకీయాల్లోకి వస్తున్నారు. ఇంకా రావాలి కూడా’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
‘డీప్ ఫేక్’తో ప్రమాదమే..
డీప్ ఫేక్ వీడియోల వల్ల మహిళలకు మాత్రమే కాదు.. రాజకీయ నేతలకు కూడా ప్రమాదమేనని కేటీఆర్ ఆందోళన వెలిబుచ్చారు. తమ ప్రత్యర్థులు డీప్ ఫేక్ వాడి తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సామాజిక మాధ్యమాలు ఒక్కోసారి విషపూరితంగా తయారవుతున్నాయన్నారు. నల్సార్ విశ్వవిద్యాలయంతో కలిసి సైబర్ క్రైమ్ చట్టాన్ని రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. మాట్లాడే హక్కు ఉంది కదా అని ఎదుటివారిని దూషించడానికి వాడకూడదన్నారు. ప్రతిపక్షాలకు కూడా భారాసయే గెలుస్తుందని తెలుసని, కానీ అది ఒప్పుకోవడం ఇష్టం లేక నటిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాగార్జున సాగర్ డ్యాంపై సమసిన వివాదం
నాగార్జునసాగర్ డ్యాం వద్ద నాలుగు రోజులుగా నెలకొన్న వివాదం ఆదివారం ఉదయంతో సమసిపోయింది. ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నీటి వాటాను సక్రమంగా ఇవ్వడం లేదని బుధవారం రాత్రి ఆ రాష్ట్ర అధికారులు పోలీసు బలగాలతో డ్యాంపైకి ప్రవేశించి తెలంగాణ అధికారుల అనుమతి లేకుండా కుడి కాల్వ ద్వారా నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. -
ఓపీఎస్ అమలుకే ఉద్యోగులు మద్దతిచ్చారు
పాత పింఛన్ విధానం (ఓపీఎస్) అమలు చేస్తుందన్న నమ్మకంతో ఎన్నికల్లో ఓట్ ఫర్ ఓపీఎస్ నినాదంతో కాంగ్రెస్ పార్టీకి మద్ధతు ఇచ్చామని తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్‌గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. -
తిరుమలలో ఘనంగా కార్తిక స్నపన తిరుమంజనం
పవిత్ర కార్తిక మాసంలో నిర్వహించే కార్తిక వనభోజన మహోత్సవంలో భాగంగా ఆదివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం అత్యంత వైభవంగా జరిగింది. -
Congress - RevanthReddy: చెయ్యెత్తి జై కొట్టిన తెలంగాణ
‘హస్త’వాసి ఫలించింది.. ఆ ధాటికి ‘కారు’ వెనకబడింది. మార్పు కావాలంటూ కాంగ్రెస్ చేసిన ఉద్ధృత ప్రచారం ఆ పార్టీని విజయతీరానికి చేర్చింది. ఎట్టకేలకు తెలంగాణ పీఠం దక్కింది. సుమారు దశాబ్దం తర్వాత భారాస దూకుడుకు కాంగ్రెస్ కళ్లెం వేయగలిగింది. -
Revanth Reddy: సీఎంగా రేవంత్!
తెలంగాణలో సోమవారం కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనుంది. కాంగ్రెస్ ప్రతినిధిబృందం ఆదివారం రాత్రి గవర్నర్ తమిళిసైని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత తెలిపింది. -
ఇక ప్రగతి భవన్ కాదు... ప్రజా భవన్
పదేళ్ల తర్వాత తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పారు. గతానికి భిన్నంగా ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రతిపక్షంతోపాటు అన్ని పార్టీల సహకారంతో ప్రజాస్వామిక పరిపాలన అందిస్తామన్నారు. -
సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా
ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆదివారం సాయంత్రం గవర్నర్ తమిళిసైకి అధికారుల ద్వారా తన రాజీనామా లేఖను పంపించారు. కేసీఆర్ రాజీనామాను గవర్నర్ తమిళిసై ఆదివారం రాత్రి ఆమోదించారు. -
డీజీపీ అంజనీకుమార్‌పై సస్పెన్షన్ వేటు
తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌పై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) సస్పెన్షన్ వేటు వేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. -
నిరంజన్‌రెడ్డి కాన్వాయ్‌పై దాడి
భారాస అభ్యర్థి, మంత్రి నిరంజన్‌రెడ్డి కాన్వాయ్‌పై కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. ఫలితాల సరళిని అంచనా వేసిన ఆయన 12వ రౌండ్ నడుస్తుండగా లెక్కింపు కేంద్రం నుంచి తిరిగి బయల్దేరారు. -
జేఈఈ దరఖాస్తు ఫీజు పెంపు
ఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తు ఫీజును వరుసగా రెండో ఏడాదీ పెంచారు. అమ్మాయిలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు గత ఏడాది రూ.1450 ఉండగా దాన్ని రూ.1600లకు, ఇతరులకు రూ.2,900ల నుంచి రూ.3,200లకు పెంచినట్లు ఐఐటీ... -
ఇదీ సంగతి!


తాజా వార్తలు (Latest News)
-
Israel: గాజాలో భూతల దాడుల్ని విస్తరించాం: ఐడీఎఫ్
-
Congress: అప్పటికప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకొని..
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Telangana Election Result: ఈసారి అత్యధికంగా అతివలు
-
Nalgonda: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం.. వ్యక్తి సజీవదహనం
-
Madhya Pradesh: మామా.. మజాకా!: కమలం గెలుపులో చౌహాన్ కీలక పాత్ర