సీఎం ముఖ్య కార్యదర్శితో ధరణి కమిటీ భేటీ

ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డి, సునీల్‌కుమార్‌లు మంగళవారం సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రితో సచివాలయంలో భేటీ అయ్యారు.

Published : 12 Jun 2024 04:39 IST

ఈనాడు, హైదరాబాద్‌: ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డి, సునీల్‌కుమార్‌లు మంగళవారం సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రితో సచివాలయంలో భేటీ అయ్యారు. ధరణి పోర్టల్‌లో లోపాలు, భూ సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలపై కమిటీ అధ్యయనం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశాలకు సంబంధించి కలెక్టర్ల వద్ద ఉన్న కొన్ని అధికారాలను విభజించి ఆర్డీవోలు, తహసీల్దార్లకు బాధ్యతలు అప్పగించేందుకు కమిటీ కృషి చేసింది. లోక్‌సభ ఎన్నికలకు ముందే దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే కార్యాచరణలో పలు సమస్యలు ఉత్పన్నమయ్యాయి. వీటితోపాటు పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారం, భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు రెవెన్యూ చట్టంలో చేయాల్సిన మార్పులను కమిటీ గుర్తించింది. వీటికి సంబంధించిన సాంకేతిక, చట్టపరమైన అంశాలపై సీఎం ముఖ్య కార్యదర్శితో కమిటీ చర్చించినట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని