పోలీసుల అదుపులో ఎస్‌ఐబీ సీఐ!

ప్రత్యేక ఇంటెలిజెన్స్‌ విభాగం (ఎస్‌ఐబీ)లో పనిచేస్తున్న ఓ సీఐని హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టు క్యాంపులోని ఓ ప్రయివేటు అతిథి గృహంలో పోలీసులు మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు.

Published : 12 Jun 2024 04:43 IST

అతిథి గృహంలో అసాంఘిక కార్యకలాపాలే కారణం? 

హసన్‌పర్తి, న్యూస్‌టుడే: ప్రత్యేక ఇంటెలిజెన్స్‌ విభాగం (ఎస్‌ఐబీ)లో పనిచేస్తున్న ఓ సీఐని హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టు క్యాంపులోని ఓ ప్రయివేటు అతిథి గృహంలో పోలీసులు మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు అసాంఘిక కార్యకలాపాలే కారణంగా తెలుస్తోంది. అతిథిగృహం వద్ద పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన ఆయన్ను విచారిస్తున్నారు. కేయూ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... ప్రత్యేక ఇంటెలిజెన్స్‌ విభాగంలో పనిచేస్తున్న సీఐ మంగళవారం మధ్యాహ్నం ఓ యువతిని కారులో చింతగట్టు క్యాంపులోని అతిథి గృహానికి తీసుకొచ్చారు. విషయం ఓ పోలీసు ఉన్నతాధికారి దృష్టికి వెళ్లడంతో విచారణ జరిపి, నివేదిక అందించాలని స్పెషల్‌ బ్రాంచి పోలీసులను ఆదేశించారు. వారు కేయూ పోలీసులతో కలిసి అతిథిగృహానికి వెళ్లారు. ఆ సమయంలో యువతి ఉన్న కింది గదిలో నుంచి సీఐ పైఅంతస్తుకు వెళుతుండటాన్ని చూసిన కేయూ ఎస్సై రాజ్‌కుమార్, స్పెషల్‌ బ్రాంచి పోలీసు అధికారులు ఆయన్ని అక్కడే అదుపులోకి తీసుకున్నారు. పైఅంతస్తులో సీఐ మిత్రులు మద్యం పార్టీలో ఉన్నట్లు గుర్తించారు. సీఐని, యువతిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై కేయూ ఎస్సై రాజ్‌కుమార్‌ను వివరణ కోరగా... ఈ ఘటనపై చింతగట్టు గెస్ట్‌ హౌస్‌లోనే ఇంకా విచారణ సాగుతోందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు