సంక్షిప్త వార్తలు

వైద్య, ఆరోగ్యశాఖలో సాధారణ బదిలీలు పారదర్శకంగా జరిగేలా చూడాలని తెలంగాణ రాష్ట్ర బోధన వైద్యుల సంఘం ప్రభుత్వానికి విన్నవించింది.

Published : 12 Jun 2024 04:44 IST

బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలి
వైద్య, ఆరోగ్యశాఖ మంత్రికి వినతి

ఈనాడు, హైదరాబాద్‌: వైద్య, ఆరోగ్యశాఖలో సాధారణ బదిలీలు పారదర్శకంగా జరిగేలా చూడాలని తెలంగాణ రాష్ట్ర బోధన వైద్యుల సంఘం ప్రభుత్వానికి విన్నవించింది. జిల్లాల్లోని వైద్య కళాశాలల్లో అయిదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం నుంచి పనిచేస్తున్న వారికి బదిలీల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కోరింది. బోధన వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కిరణ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి కిరణ్‌ తదితరులు మంగళవారం సచివాలయంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఏడేళ్ల తర్వాత జరుగుతున్న బదిలీలు కావడంతో పరిమితులు లేకుండా ఎక్కువమందికి ప్రయోజనం ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 


నాసా ఐఎస్‌డీ సదస్సులో శ్రీచైతన్య విద్యార్థుల ప్రతిభ

జూబ్లీహిల్స్, న్యూస్‌టుడే: నాసా ఆధ్వర్యంలో నేషనల్‌ స్పేస్‌ సొసైటీ(ఎన్‌ఎస్‌ఎస్‌) నిర్వహించే అంతర్జాతీయ అంతరిక్ష అభివృద్ధి సదస్సు(ఐఎస్‌డీసీ)కు శ్రీచైతన్య పాఠశాల విద్యార్థులు అత్యధిక సంఖ్యలో హాజరై అనేక నమూనాలకు బహుమతులను గెలుచుకున్నారని పాఠశాల అకడమిక్‌ డైరెక్టర్‌ సీమ తెలిపారు. జూబ్లీహిల్స్‌లో మంగళవారం నిర్వహించిన అభినందన సభలో ఈ వివరాలను వెల్లడించారు. సదస్సుకు సుమారు 30 దేశాల నుంచి విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. శ్రీచైతన్య నుంచి దేశవ్యాప్తంగా 167 మంది విద్యార్థులు అమెరికా వెళ్లారని.. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన 35 మంది ఉన్నారని చెప్పారు. ఎన్‌ఎస్‌ఎస్‌ నిర్వహించిన స్పేస్‌ సెటిల్‌మెంట్‌ పోటీల్లో తమ విద్యార్థులు 62 ప్రాజెక్టులకు బహుమతులు గెలుపొంది వరుసగా 11వ సారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచారన్నారు. ఆర్టిస్టిక్‌ మెరిట్, లిటరరీ మెరిట్‌ విభాగాల్లో 500 డాలర్ల చొప్పున బహుమతి అందుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఏజీఎంలు జీవీఆర్, సతీష్, కృష్ణ, ఎస్‌ఆర్‌కే తదితరులు పాల్గొన్నారు. 


దిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రిగా మంగళవారం బాధ్యతలు స్వీకరించిన అమిత్‌షాను అభినందిస్తున్న ఆ శాఖ సహాయ మంత్రులు నిత్యానందరాయ్, బండి సంజయ్‌.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని