రైతు వేదికల్లో 38,794 మందికి శిక్షణ

రైతు వేదికల నుంచి గత 11 వారాలుగా నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్‌ కార్యక్రమం ద్వారా 38,794 మంది రైతులకు శిక్షణ ఇచ్చినట్లు వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Published : 12 Jun 2024 04:46 IST

రైతు నేస్తం కార్యక్రమంలో మంత్రి తుమ్మల

ఈనాడు, హైదరాబాద్‌: రైతు వేదికల నుంచి గత 11 వారాలుగా నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్‌ కార్యక్రమం ద్వారా 38,794 మంది రైతులకు శిక్షణ ఇచ్చినట్లు వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దీనిని మరింతగా విస్తరిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 110 కేంద్రాల్లో వీడియో కాన్ఫరెన్స్‌ సేవలు అందుబాటులో ఉన్నాయని, ఈ నెలాఖరులోపు మరో 456 వేదికల్లో ఈ సేవలను అందుబాటులోకి తెస్తామని వివరించారు. మంగళవారం ఆయన రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా రైతువేదికల ద్వారా వీడియో కాన్ఫరెన్స్‌లో  రైతులతో మాట్లాడారు. 

సేంద్రియ విధానంలో సాగుతో లాభాలు

రైతులు సేంద్రియ విధానంలో పంటలు పండిస్తే.. గిట్టుబాటు ధరలు వస్తాయని, ఎగుమతులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని తుమ్మల తెలిపారు. ‘‘రాష్ట్రంలో పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేశాం. పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ఒకే రకం విత్తనాలు కావాలని రైతులు ఆరాటపడొద్దు. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అన్నిరకాల విత్తనాలు ఒకే రకమైన దిగుబడులు ఇస్తాయి. మహిళా రైతులు కూడా రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొనేలా ప్రోత్సహిస్తాం’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు