సిరిసిల్ల అర్బన్‌ బ్యాంకు అభివృద్ధికి సంపూర్ణ సహకారం: కేటీఆర్‌

సిరిసిల్ల అర్బన్‌ బ్యాంకు నూతన ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్, డైరెక్టర్లను భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో సన్మానించారు.

Updated : 13 Jun 2024 05:35 IST

సిరిసిల్ల అర్బన్‌ బ్యాంకు ఛైర్మన్‌ రాపెల్లి లక్ష్మీనారాయణను అభినందిస్తున్న
కేటీఆర్‌. చిత్రంలో వైస్‌ ఛైర్మన్‌ అడ్డగట్ల మురళి, డైరెక్టర్లు

ఈనాడు, హైదరాబాద్‌: సిరిసిల్ల అర్బన్‌ బ్యాంకు నూతన ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్, డైరెక్టర్లను భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో సన్మానించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన అర్బన్‌ బ్యాంకు ఛైర్మన్‌ రాపెల్లి లక్ష్మీనారాయణ, వైస్‌ ఛైర్మన్‌ అడ్డగట్ల మురళితో పాటు డైరెక్టర్లు కేటీఆర్‌ను కలిశారు. వారిని ఆయన అభినందిస్తూ.. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. బ్యాంకు అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారాస రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పార్టీ సిరిసిల్ల పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, నాయకులు రామ్మోహన్, పూర్ణచందర్, రవి, అగ్గిరాములు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని