ఆబ్కారీశాఖ సమస్యలను సత్వరమే పరిష్కరించండి

ఆబ్కారీశాఖ పునర్‌వ్యవస్థీకరణను సత్వరమే పూర్తి చేయాలని ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు రాష్ట్ర ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారుల సంఘం విజ్ఞప్తి చేసింది.

Published : 13 Jun 2024 05:39 IST

మంత్రి జూపల్లికి ఉద్యోగుల విజ్ఞప్తి

మంత్రి జూపల్లికి వినతిపత్రం సమర్పిస్తున్న ఆబ్కారీ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు   

ఈనాడు, హైదరాబాద్‌: ఆబ్కారీశాఖ పునర్‌వ్యవస్థీకరణను సత్వరమే పూర్తి చేయాలని ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు రాష్ట్ర ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు అధ్యక్షుడు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో సంఘం ప్రతినిధులు బుధవారం సచివాలయంలో మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆబ్కారీశాఖ పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించి 2020 ఆగస్టు 31నే ఉత్తర్వులు వెలువడ్డాయని, దీనివల్ల కానిస్టేబుల్‌ నుంచి అదనపు కమిషనర్‌ వరకు మొత్తం 131 అదనపు పోస్టులు సృష్టించారన్నారు. అయితే రాష్ట్రస్థాయి పోస్టులు భర్తీ చేసినప్పటికీ సీఐ, ఎస్సై, కానిస్టేబుల్‌ స్థాయి పోస్టులు సాంకేతిక కారణాలతో పెండింగ్‌లోనే ఉన్నాయని తెలిపారు. ఇంకా సీనియార్టీ జాబితా కూడా రూపొందించడం లేదని, 14 కొత్త ఎక్సైజ్‌ పోలీసుస్టేషన్లు మంజూరు చేసినా ఇప్పటికీ ఏర్పాటు చేయలేదని మంత్రికి వివరించారు. అలాగే ఎన్నికల నిబంధనల్లో భాగంగా ఇటీవల నిర్వహించిన బదిలీలను కూడా పునఃపరిశీలించాలని కోరారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.రామిరెడ్డి తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని