రామయ్య హుండీ ఆదాయం రూ.1.68 కోట్లు

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ హుండీ ఆదాయాన్ని కోవెల ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో బుధవారం లెక్కించారు.

Published : 13 Jun 2024 05:40 IST

 

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ హుండీ ఆదాయాన్ని కోవెల ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో బుధవారం లెక్కించారు. 41 రోజులకు గాను రూ.1,68,54,129 ఆదాయం సమకూరినట్లు ఈవో రమాదేవి ప్రకటించారు. అలాగే 117 గ్రాముల బంగారం, 1.30 కిలోల వెండిని భక్తులు సమర్పించారు. ఇక విదేశీ కరెన్సీ..యూఎస్‌ డాలర్లు 557, ఖతార్‌ రియాల్స్‌ 5, ఇంగ్లండ్‌ పౌండ్స్‌ 20, ఫిలిప్పీన్స్‌ పీసో 20, నేపాలీస్‌ రుపీ 950, యూఏఈ దిర్హామ్స్‌ 20, మలేసియా రింగెట్స్‌ 14, ఆస్ట్రేలియన్‌ డాలర్లు 60, కెనడా డాలర్లు 20 సమకూరాయి. హనుమజ్జయంతికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని