జెన్‌కో ఏఈ పోస్టుల భర్తీకి జులై 14న రాతపరీక్ష

తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో) సహాయ ఇంజినీరు(ఏఈ) పోస్టుల భర్తీకి వచ్చేనెల 14న రాతపరీక్ష నిర్వహించనున్నట్లు సంస్థ సీఎండీ రిజ్వీ బుధవారం జారీ చేసిన నోటిఫికేషన్‌లో తెలిపారు.

Published : 13 Jun 2024 05:41 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో) సహాయ ఇంజినీరు(ఏఈ) పోస్టుల భర్తీకి వచ్చేనెల 14న రాతపరీక్ష నిర్వహించనున్నట్లు సంస్థ సీఎండీ రిజ్వీ బుధవారం జారీ చేసిన నోటిఫికేషన్‌లో తెలిపారు. ఈ పోస్టుల భర్తీకి 2023 అక్టోబరు 4న ప్రకటన జారీ చేశారు. రాతపరీక్షను గత మార్చి 31న నిర్వహించాలని నిర్ణయించినా ఎన్నికల కోడ్‌ వల్ల జులై 14కు వాయిదా వేసినట్లు ఆయన వివరించారు. జులై 3 నుంచి హాల్‌టికెట్లను సంస్థ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని