నేడు బాధ్యతలు చేపట్టనున్న కిషన్‌రెడ్డి, సంజయ్‌

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, సికింద్రాబాద్‌ ఎంపీ జి.కిషన్‌రెడ్డి, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ గురువారం కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

Published : 13 Jun 2024 05:41 IST

ఈనాడు, హైదరాబాద్‌: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, సికింద్రాబాద్‌ ఎంపీ జి.కిషన్‌రెడ్డి, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ గురువారం కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. క్యాబినెట్‌ హోదాలో బొగ్గు, గనులశాఖ మంత్రిగా నియమితులైన కిషన్‌రెడ్డి దిల్లీలోని శాస్త్రిభవన్‌ ఏ బ్లాక్‌లో ఉదయం 11 గంటలకు., హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్‌ ఉదయం 10.35 గంటలకు నార్త్‌ బ్లాక్‌లో పదవీ బాధ్యతలు చేపట్టనున్నారని భాజపా ఒక ప్రకటనలో పేర్కొంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని