మేడిగడ్డ బ్యారేజీలోమరో రెండు గేట్ల ఎత్తివేత

మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన ఏడో బ్లాక్‌లో 18, 19 గేట్లను ఇంజినీరింగ్‌ అధికారులు గురువారం పైకెత్తారు.

Published : 14 Jun 2024 05:30 IST

మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాకులో పైకెత్తిన 18వ గేటు

మహదేవపూర్, న్యూస్‌టుడే: మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన ఏడో బ్లాక్‌లో 18, 19 గేట్లను ఇంజినీరింగ్‌ అధికారులు గురువారం పైకెత్తారు. 18వ గేటు ఎత్తే క్రమంలో సమస్యలు ఎదురుకాగా.. గేటు చివరి భాగాలను కటింగ్‌ ద్వారా తొలగించారు. బ్యారేజీలో మొత్తం 85 గేట్లు ఉండగా గత అక్టోబరులో బ్యారేజీ కుంగినప్పుడు 77 గేట్లను ఎత్తి.. నీటిని కిందికి వదిలారు. బ్యారేజీకి తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని, మిగిలిన గేట్లను తొలగించాలని నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) మధ్యంతర నివేదికలో సూచించింది. ఈ నేపథ్యంలో గత నెల 17వ తేదీన 15వ గేటును, ఈ నెల 6వ తేదీన 16, 17 గేట్లను, 7వ తేదీన 22వ గేటును పైకెత్తారు. గురువారం 18, 19 గేట్లను ఎత్తారు. ఇక 20, 21 గేట్లను తొలగించడం మిగిలింది. ఇందులో 20వ గేటు కటింగ్‌ పూర్తయింది. 21వ గేటును ఎత్తే ప్రయత్నంలో అవాంతరం ఏర్పడితే.. కట్‌ చేసి తొలగించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని