కుల, మత రహితంగా పాఠశాల రికార్డుల తయారీపై కౌంటరు దాఖలు చేయండి

పాఠశాల అడ్మిషన్, ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్లలో కుల, మత ప్రస్తావన లేకుండా రికార్డులు రూపొందించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వ విధానమేమిటో తెలియజేస్తూ మూడు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలంటూ గురువారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Published : 14 Jun 2024 05:32 IST

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 

ఈనాడు, హైదరాబాద్‌: పాఠశాల అడ్మిషన్, ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్లలో కుల, మత ప్రస్తావన లేకుండా రికార్డులు రూపొందించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వ విధానమేమిటో తెలియజేస్తూ మూడు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలంటూ గురువారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కౌంటరు దాఖలుకు మరోసారి గడువు కోరరాదని పేర్కొంది. పాఠశాల సర్టిఫికేట్లలో తల్లిదండ్రుల కులం, మతం పేర్కొనాలన్న నిబంధనను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన డి.వి.రామకృష్ణ, మరొకరు 2017లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేయడంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. దీనిపై ఇప్పటికే కేంద్రం కౌంటరు దాఖలు చేస్తూ.. జనాభా గణన సమయంలో కుల, మతాల వారీగా సేకరించిన గణాంకాలు నిత్య జీవితంలో, పాఠశాల రికార్డుల్లో ఎందుకూ ఉపయోగపడవని వివరణ ఇచ్చింది. అయితే వాటిని ఉంచాలా లేదా అనేది రాష్ట్ర ప్రభుత్వాల విధాన నిర్ణయమని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని