నేడు ఓ మోస్తరు వర్షాలు

రాష్ట్రమంతటా శుక్రవారం ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది.

Published : 14 Jun 2024 05:36 IST

రాష్ట్రమంతటా విస్తరించిన నైరుతి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రమంతటా శుక్రవారం ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు అన్ని జిల్లాలకు విస్తరించాయి. ఈ నెల 3న రాష్ట్రంలోకి ప్రవేశించగా.. 10 రోజుల్లో రాష్ట్రమంతటా వ్యాపించాయి. గురువారం రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళపల్లిలో 7.4 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం పెద్దగోపతిలో 6.8, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం రెడ్డిపల్లిలో 5.5, ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం రావినూతలలో 5.3, మధిర మండలం శ్రీపురంలో 5.2, మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం సంకీసలో 5.2 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. ఆదిలాబాద్, మెదక్, సిద్దిపేట, హైదరాబాద్‌ జిల్లాల్లోనూ అనేక ప్రాంతాల్లో చినుకులు పడ్డాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని