నేడు టీజీ ఐసెట్‌ ఫలితాల విడుదల

రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 5, 6 తేదీల్లో నిర్వహించిన ‘టీజీ ఐసెట్-24’ ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల కానున్నాయి.

Updated : 14 Jun 2024 10:35 IST

ఈనాడు, హైదరాబాద్‌- విద్యానగర్‌(హనుమకొండ), న్యూస్‌టుడే: రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 5, 6 తేదీల్లో నిర్వహించిన ‘టీజీ ఐసెట్-24’ ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల కానున్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో కాకతీయ విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జి వీసీ వాకాటి కరుణ, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి తదితరులు ఫలితాలను విడుదల చేస్తారని కన్వీనర్‌ ఆచార్య ఎస్‌.నరసింహాచారి ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలను ఈనాడు డాట్‌ నెట్, ఈనాడు ప్రతిభ వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని