5 గంటలు ఆలస్యంగా తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌

హైదరాబాద్‌ నుంచి న్యూదిల్లీ స్టేషన్‌కు వెళ్లే తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌  శుక్రవారం 5 గంటలు ఆలస్యంగా బయల్దేరనుంది.

Published : 14 Jun 2024 05:40 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నుంచి న్యూదిల్లీ స్టేషన్‌కు వెళ్లే తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌  శుక్రవారం 5 గంటలు ఆలస్యంగా బయల్దేరనుంది. ఈ రైలుకు నాంపల్లి(హైదరాబాద్‌) స్టేషన్‌ నుంచి నిర్ణీత సమయం మేరకు శుక్రవారం ఉదయం 6 గంటలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వాలి. కానీ, తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ శుక్రవారం ఉదయం 11 గంటలకు బయల్దేరుతుందని ద.మ.రైల్వే గురువారం తెలిపింది. దిల్లీ నుంచి హైదరాబాద్‌కు బుధవారం బయల్దేరిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ బాగా ఆలస్యంగా నడుస్తోంది. నాగ్‌పుర్‌ స్టేషన్‌కు గురువారం ఉదయం 7.10 గంటలకు చేరుకోవాల్సి ఉండగా, దాదాపు 9 గంటల ఆలస్యంగా.. అంటే సాయంత్రం 4.15కి చేరుకుంది. దీంతో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ శుక్రవారం బయల్దేరే సమయాన్ని ద.మ.రైల్వే మార్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని