ప్రాజెక్టుల్లో పనులపై నివేదిక ఇవ్వండి

గత ప్రభుత్వాల హయాంలో ఎక్కువ శాతం పనులు జరిగి, ఆయకట్టుకు నీళ్లందించడానికి అవకాశమున్న ప్రాజెక్టుల వివరాలను సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

Published : 15 Jun 2024 04:58 IST

నీటిపారుదల శాఖ అధికారులకు మంత్రి ఉత్తమ్‌ ఆదేశం 

ఈనాడు, హైదరాబాద్‌: గత ప్రభుత్వాల హయాంలో ఎక్కువ శాతం పనులు జరిగి, ఆయకట్టుకు నీళ్లందించడానికి అవకాశమున్న ప్రాజెక్టుల వివరాలను సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్, ఈఎన్సీలు అనిల్‌కుమార్, నాగేందర్‌రావు, హరిరాంలతో కలిసి అన్ని ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజినీర్లతో శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టుల పనుల పురోగతిపై చర్చించారు. ‘‘75 శాతానికి పైగా పనులు పూర్తయి, ఆయకట్టుకు నీళ్లివ్వడానికి అవకాశమున్న వాటి వివరాలపై నివేదిక సిద్ధం చేయాలి. చేయాల్సిన పనులు, అవసరమైన నిధుల వివరాలను పొందుపరచాలి. సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి నిధుల విడుదలకు చర్యలు తీసుకొంటాం’’ అని మంత్రి పేర్కొన్నారు. ఇంజినీర్ల పదోన్నతుల జాబితాను కూడా సిద్ధం చేయాలని, ఖాళీగా ఉన్న చీఫ్‌ ఇంజినీర్ల పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని, వారం రోజుల్లో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు మొదలు ఈఎన్సీల వరకు బదిలీలు ఉంటాయని కూడా మంత్రి చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని