హైదరాబాద్‌లో ఎన్‌ఐఐఎంహెచ్‌-డబ్ల్యూహెచ్‌ఓ ప్రత్యేక పరిశోధన కేంద్రం

హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ హెరిటేజ్‌(ఎన్‌ఐఐఎంహెచ్‌), ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) సంయుక్తంగా హైదరాబాద్‌లో ప్రత్యేక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాయి.

Published : 15 Jun 2024 05:04 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ హెరిటేజ్‌(ఎన్‌ఐఐఎంహెచ్‌), ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) సంయుక్తంగా హైదరాబాద్‌లో ప్రత్యేక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాయి. సంప్రదాయ వైద్యం, ఔషధ పరిశోధనల కోసం ఈ కేంద్రం నాలుగేళ్లపాటు పని చేయనుంది. కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వశాఖ అధీనంలోని ఎన్‌ఐఐఎంహెచ్‌ ఆయుర్వేదం, యోగా నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి, బయోమెడిసిన్‌ ఇతర సంబంధిత ఆరోగ్య సంరక్షణ విభాగాల్లో వైద్య-చారిత్రక పరిశోధనలను డాక్యుమెంట్‌ చేస్తుంది. సంస్థ చేస్తున్న కృషిని డబ్ల్యూహెచ్‌ఓ గుర్తించిందని ఆ విభాగం అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో కేంద్రం ఏర్పాటుకు ఇటీవల ఒప్పందం కుదిరిందని, ఈ నెల 3 నుంచి పనులు ప్రారంభించిందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని