కవితతో కేటీఆర్‌ భేటీ

దిల్లీ మద్యం కేసులో అరెస్టయి జ్యుడిషియల్‌ రిమాండ్‌లో భాగంగా ఇక్కడి తిహాడ్‌ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను ఆమె సోదరుడు, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కలిశారు.

Published : 15 Jun 2024 05:04 IST

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసులో అరెస్టయి జ్యుడిషియల్‌ రిమాండ్‌లో భాగంగా ఇక్కడి తిహాడ్‌ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను ఆమె సోదరుడు, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కలిశారు. ములాఖత్‌లో భాగంగా శుక్రవారం ఆయన తిహాడ్‌ జైలుకెళ్లి ఆమెతో భేటీ అయ్యారు. సుమారు అరగంటకు పైగా వారి సమావేశం జరిగింది. కవిత జ్యుడిషియల్‌ కస్టడీ ఈడీ కేసులో జులై 3 వరకు, సీబీఐ కేసులో జూన్‌ 21 వరకు ఉంది. సీబీఐ ఆమెపై దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టు ఈ నెల 21న విచారణ జరపనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని