ఆయిల్‌పాం సలహా కమిటీ నియామకం

తెలంగాణ ప్రభుత్వం ఆయిల్‌పాం సలహా కమిటీని నియమించింది. ఈ మేరకు వ్యవసాయ, ఉద్యానశాఖ ప్రధాన కార్యదర్శి ఎం.రఘునందన్‌రావు ఆదేశాలను ఉద్యానశాఖ సంచాలకులు, ఆయిల్‌ఫెడ్‌ ఎండీ కె.అశోక్‌రెడ్డి శుక్రవారం విడుదల చేశారు.

Published : 15 Jun 2024 05:04 IST

అశ్వారావుపేట, న్యూస్‌టుడే: తెలంగాణ ప్రభుత్వం ఆయిల్‌పాం సలహా కమిటీని నియమించింది. ఈ మేరకు వ్యవసాయ, ఉద్యానశాఖ ప్రధాన కార్యదర్శి ఎం.రఘునందన్‌రావు ఆదేశాలను ఉద్యానశాఖ సంచాలకులు, ఆయిల్‌ఫెడ్‌ ఎండీ కె.అశోక్‌రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. కమిటీ ఛైర్మన్‌గా వ్యవసాయ, ఉద్యానశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉంటారు. సభ్యులుగా వైరా, నారాయణపేట, ఖానాపూర్‌ ఎమ్మెల్యేలు మాలోతు రాందాస్‌నాయక్, డాక్టర్‌ చిట్టెం పర్నికరెడ్డి, వెడ్మ బొజ్జు నియమితులయ్యారు. వ్యవసాయ సహకారశాఖ, పరిశ్రమలు, ఆర్థికశాఖల ప్రభుత్వ కార్యదర్శులు, వ్యవసాయశాఖ కమిషనర్, ఉద్యాన-పట్టుపరిశ్రమ శాఖ సంచాలకులు, వాణిజ్య-పరిశ్రమల సంచాలకులు, కొండా లక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి, ఏలూరు జిల్లాలోని పెదవేగి ఐఐఓపీఆర్‌ ప్రధాన సంచాలకుడు, కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రతినిధి, టీజీ ఆయిల్‌ఫెడ్‌ పరిశ్రమల విభాగం ప్రతినిధి కూడా కమిటీలో ఉంటారు. ప్రీయూనిక్‌ పామాయిల్‌ పరిశ్రమ, పతంజలి ఫుడ్స్‌ లిమిటెడ్‌ పరిశ్రమ, లోహియా ఎడిబుల్‌ ఆయిల్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ పరిశ్రమల నుంచి ప్రతినిధులు... రైతుల్లో భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం అల్లిపల్లికి చెందిన ఆలపాటి రామచంద్రప్రసాద్, మహబూబాబాద్‌ జిల్లా చిన్నగూడూరు మండలం జయ్యారం నుంచి వి.కృష్ణారెడ్డి, నిజామాబాద్‌ జిల్లా ముపకల్‌ మండలం రేంజర్ల గ్రామం నుంచి ఎస్‌.రాజేశ్వర్, సిద్దిపేట జిల్లా పుల్లూరు నుంచి జి.రామచంద్రారెడ్డి సభ్యులుగా నియమితులయ్యారు. కార్యదర్శిగా ఆయిల్‌పాం కమిషనర్‌ వ్యవహరిస్తారు. ఈ కమిటీ మూడేళ్లపాటు అమలులో ఉంటుందని ఆదేశాలు ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని