నెలాఖరులోగా పెండింగ్‌ భూ సమస్యలు పరిష్కరించాలి

ధరణి పోర్టల్లో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను నెలాఖరులోగా పరిష్కరించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, భూ పరిపాలన ప్రధాన కార్యదర్శి(సీసీఎల్‌ఏ) నవీన్‌మిత్తల్‌ కలెక్టర్లను ఆదేశించారు.

Published : 15 Jun 2024 05:06 IST

కలెక్టర్లకు సీసీఎల్‌ఏ నవీన్‌మిత్తల్‌ ఆదేశాలు 

ఈనాడు, హైదరాబాద్‌: ధరణి పోర్టల్లో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను నెలాఖరులోగా పరిష్కరించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, భూ పరిపాలన ప్రధాన కార్యదర్శి(సీసీఎల్‌ఏ) నవీన్‌మిత్తల్‌ కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం ఉమ్మడి జిల్లాల వారీగా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు ఎన్ని, ఏఏ సమస్యలపై అవి దాఖలయ్యాయి తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాసు పుస్తకాల్లో తప్పుల దిద్దుబాటు, రెండు అంతకంటే ఎక్కువగా నమోదైన ఖాతాల విలీనం లాంటివే అధికంగా పెండింగ్‌లో ఉన్నట్టు కొన్ని జిల్లాల అధికారులు వివరించారు. సాంకేతిక సమస్యలు కొన్ని ఇబ్బందిగా మారాయని మరికొందరు ప్రస్తావించారు. ధరణిలో ఇప్పటికే 163 సాంకేతిక లోపాలను పరిష్కరించామని ఈ సందర్భంగా సీసీఎల్‌ఏ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2.20 లక్షల దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నాయని, వాటిని వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశాలిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని