ఆర్టీసీపై ట్రైనీ ఐఏఎస్‌ల అధ్యయనం

తెలంగాణ క్యాడర్‌కు చెందిన 2023 బ్యాచ్‌ ట్రైనీ ఐఏఎస్‌లు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో అమలు చేస్తున్న కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు హైదరాబాద్‌లోని బస్‌భవన్‌కు శుక్రవారం వెళ్లారు.

Published : 15 Jun 2024 05:08 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ క్యాడర్‌కు చెందిన 2023 బ్యాచ్‌ ట్రైనీ ఐఏఎస్‌లు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో అమలు చేస్తున్న కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు హైదరాబాద్‌లోని బస్‌భవన్‌కు శుక్రవారం వెళ్లారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఉన్నతాధికారులు రవీందర్, అపూర్వరావు, మునిశేఖర్, కృష్ణకాంత్‌లతో సమావేశమయ్యారు. ఆర్టీసీ పనితీరు, బస్సుల్లో మహాలక్ష్మి పథకం అమలు, ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు తదితర అంశాలను అధికారులు వారికి వివరించారు. ట్రైనీ ఐఏఎస్‌లు ఉమాహారతి, గరిమా నరులా, మనోజ్, మృణాల్, శంకేత్, అభిజ్ఞాన్, అజయ్‌లతో పాటు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ) సీడీఎస్‌ సెంటర్‌ హెడ్‌ కందుకూరి ఉషారాణి, నోడల్‌ అధికారి శ్రీనివాస్‌ కూడా ఉన్నారు. ట్రైనీ ఐఏఎస్‌లు ప్రస్తుతం ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో శిక్షణ తీసుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని