నీళ్లు తగ్గి.. ఇసుక మేటలు తేలి

ఈ చిత్రంలో కనిపిస్తోంది తెలంగాణ వరప్రదాయిని శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో రోజురోజుకు నీటిమట్టం తగ్గుతోంది.

Published : 15 Jun 2024 05:08 IST

ఈ చిత్రంలో కనిపిస్తోంది తెలంగాణ వరప్రదాయిని శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో రోజురోజుకు నీటిమట్టం తగ్గుతోంది. దీని నుంచి ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు సాగు, తాగు నీరందుతుంది. వానాకాలం మొదలై 15 రోజులు కావస్తున్నా ఎగువ ప్రాంతాల్లో సరైన వర్షాలు పడకపోవడంతో వరద రావడం లేదు. 80.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో శుక్రవారం నాటికి 7.5 టీఎంసీల నీరు మాత్రమే ఉండడం గమనార్హం. గతేడాది ఇదే సమయానికి 15.9 టీఎంసీల నిల్వ ఉంది. ప్రస్తుతం నీటి మట్టం తగ్గడంతో ఇసుక మేటలు కనిపిస్తున్నాయి. 

ఈనాడు, నిజామాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని