‘సీతారామ’.. ఈసారైనా పూర్తయ్యేనా..?

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల్లోని 7.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఏడేళ్ల క్రితం రూ.13,500 కోట్ల అంచనా వ్యయంతో సీతారామ ప్రాజెక్టుకు అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

Published : 15 Jun 2024 05:42 IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని అక్విడక్ట్‌ సమీపంలోని కాల్వలో ఎండిన గడ్డి

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల్లోని 7.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఏడేళ్ల క్రితం రూ.13,500 కోట్ల అంచనా వ్యయంతో సీతారామ ప్రాజెక్టుకు అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కానీ పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంది. ప్రధాన కాల్వలో కొన్నిచోట్ల జమ్మిగడ్డి పెరిగింది. పరీవాహక వాగులు, గోదావరి నది వరదలతో అక్కడక్కడ గండ్లు పడ్డాయి. మూడు పంపుహౌస్‌ల నిర్మాణం పూర్తయి ట్రయల్‌ రన్‌కు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటివరకు పలుమార్లు గడువు విధించినా ప్రాజెక్టు అందుబాటులోకి రాలేదు. తాజాగా ఈ ఏడాది ఆగస్టు 15 వరకు సాగర్‌ కాల్వకు గోదావరి జలాలను తరలించాలనే సంకల్పంతో ప్రస్తుత ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇకనైనా పనుల్లో వేగం పెరిగి గడువులోగా సాగునీరు అందుతుందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. 

ఈనాడు, ఖమ్మం- న్యూస్‌టుడే, అశ్వాపురం


అశ్వాపురం మండలం అమెర్దా వద్ద వరదకు ప్రధాన కాల్వ కరకట్టకు పడిన గండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని