కులగణన సర్వేకు స్వతంత్ర కమిషన్‌ ఏర్పాటు చేయాలి

కులగణన సర్వే చేసి రిజర్వేషన్లు ఖరారు చేశాకే.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ కోరారు.

Published : 16 Jun 2024 06:14 IST

మంత్రి పొన్నంకు జాజుల వినతి 

ఈనాడు, హైదరాబాద్‌: కులగణన సర్వే చేసి రిజర్వేషన్లు ఖరారు చేశాకే.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ కోరారు. శనివారం ఆయన బీసీ సంఘాల నేతలతో కలిసి.. సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి ఈమేరకు వినతిపత్రం సమర్పించారు. కులగణన కోసం స్వతంత్ర కమిషన్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోపే రాష్ట్రంలో సమగ్ర కులగణన సర్వే చేపట్టి బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని అభ్యర్థించారు. బీసీ రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బీసీలకు రాజకీయంగా, విద్యా ఉద్యోగాల్లో తీరని నష్టం జరుగుతుందని ఈ సందర్భంగా జాజుల పేర్కొన్నారు. ఈ నెల 19న హైదరాబాద్‌లో ’సమగ్ర కుల గణన సవాళ్లు-  బీసీ రిజర్వేషన్ల పెంపు’ అనే అంశంపై మేధోమథన సదస్సు జరుపుతామని, జూన్‌ మూడో వారం నుంచి బీసీల బస్సు యాత్ర నిర్వహిస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు