మొలకెత్తింది కష్టాలే

జూన్‌ మొదటి వారంలో కురిసిన వర్షాలతో రైతులు పత్తి విత్తనాలు వేశారు. వారం రోజులుగా ఎండలు వేసవిని తలపిస్తున్నాయి.

Published : 16 Jun 2024 06:16 IST

చింతకానిలో ట్యాంకర్‌తో చేనులో నీటిని పడుతున్న రైతు

జూన్‌ మొదటి వారంలో కురిసిన వర్షాలతో రైతులు పత్తి విత్తనాలు వేశారు. వారం రోజులుగా ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. దాంతో తడి అందక గింజలు అరకొరగా మొలకెత్తాయి. అవి కూడా ఎండలకు మాడిపోతున్నాయి. కనీసం ఓ మోస్తరు వర్షమైనా కురవకుంటే మిగిలిన గింజలు గుల్లబారే ప్రమాదముంది. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చింతకాని గ్రామంలో సుబ్బారెడ్డి, లక్ష్మారెడ్డి అనే రైతులు మూడెకరాల్లో పత్తి గింజలు వేయగా ఎండల తీవ్రతకు చాలావరకు మొలకెత్తలేదు. దీంతో ట్రాక్టర్‌కు అమర్చిన స్ప్రింక్లర్‌తో నీటిని సాళ్ల వెంట పడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు వాపోతున్నారు. 

న్యూస్‌టుడే, కాటారం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని