నేడు సివిల్స్‌ ప్రాథమిక పరీక్ష

ప్రతిష్ఠాత్మక సివిల్‌ సర్వీసెస్‌-2024 ప్రాథమిక పరీక్ష దేశవ్యాప్తంగా ఆదివారం జరగనుంది. మొత్తం 1,056 ఉద్యోగాలు ఉండగా... ప్రిలిమ్స్‌కు దేశవ్యాప్తంగా 13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

Published : 16 Jun 2024 06:19 IST

హైదరాబాద్, వరంగల్‌లో పరీక్షా కేంద్రాలు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రతిష్ఠాత్మక సివిల్‌ సర్వీసెస్‌-2024 ప్రాథమిక పరీక్ష దేశవ్యాప్తంగా ఆదివారం జరగనుంది. మొత్తం 1,056 ఉద్యోగాలు ఉండగా... ప్రిలిమ్స్‌కు దేశవ్యాప్తంగా 13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మనరాష్ట్రం నుంచి 49,883 మంది ఉన్నారు. హైదరాబాద్‌లో 45,153 మందికి 99 పరీక్ష కేంద్రాలను, వరంగల్‌లో 4,730 మందికి 11 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు పేపర్‌-2 నిర్వహిస్తారు. పరీక్ష ప్రారంభానికి అర గంట ముందుగానే అన్ని కేంద్రాల గేట్లు మూసివేస్తారు. నిరుటి వరకు 10 నిమిషాల ముందు గేట్లు మూసి వేసేవారు. ప్రతి కేంద్రం వద్ద జామర్లు ఏర్పాటు చేశారు. 

హాజరయ్యేవారు 50 శాతం లోపే 

ప్రిలిమ్స్‌కు ప్రతి ఏడాది పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నా... వారిలో సగం మందే పరీక్ష రాస్తున్నట్లు యూపీఎస్‌సీ గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. ఉదాహరణకు 2020లో 10.57 లక్షల మందికి 4.82 లక్షలు, 2021లో 10.93 లక్షలకు 5.08 లక్షలు, 2022లో 11.35 లక్షలకు 5.73 లక్షల మంది హాజరయ్యారు. గత సంవత్సరం 13 లక్షల మంది దరఖాస్తు చేయగా...5.50 లక్షల మంది పరీక్ష రాశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని