మేడిగడ్డలో భారీగా ఇసుక పూడిక

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ మునక ప్రాంతంలో 92.77 లక్షల టన్నుల ఇసుక పూడికను తీయనున్నారు.

Published : 17 Jun 2024 04:37 IST

14 బ్లాక్‌లలో 92.77 లక్షల టన్నుల గుర్తింపు
తవ్వి తరలించేందుకు టెండర్లు పిలిచిన టీజీఎండీసీ

ఈనాడు, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ మునక ప్రాంతంలో 92.77 లక్షల టన్నుల ఇసుక పూడికను తీయనున్నారు. దీనికోసం తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) 14 బ్లాక్‌లను గుర్తించింది. ఆయా ప్రాంతాల్లో ఇసుకను తవ్వి తీసి విక్రయించనుంది. ముంపు ప్రాంతంలోని ఇసుకను తీసి స్టాక్‌యార్డుల వరకు తరలించడం, ఆ తర్వాత లారీల్లో లోడింగ్‌ చేసేందుకు గుత్తేదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం టెండర్లను ఆహ్వానించింది. ఇసుకపూడిక తీయడం ద్వారా బ్యారేజీలో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని టీజీఎండీసీ పేర్కొంది. 

బిడ్ల దాఖలుకు వారం రోజుల గడువు...

మేడిగడ్డ బ్యారేజీని నిర్మించిన తర్వాత ప్రాజెక్టులోకి గోదావరి నీళ్లతో పాటు పెద్దఎత్తున ఇసుక వచ్చి చేరింది. 14 బ్లాక్‌లలో 92,77,343 టన్నుల ఇసుక ఉన్నట్లు టీజీఎండీసీ గుర్తించింది. భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారేజీ కుడి వైపు మహదేవపూర్‌ మండలం సూరారం, కుంట్లం గ్రామాల పరిధిలో ఉన్న ముంపు ప్రాంతాల నుంచి ఇసుక తీయాలని నిర్ణయించి ఆయా బ్లాక్‌లకు విడివిడిగా టెండర్లు ఆహ్వానించింది. బిడ్లను జూన్‌ 18 నుంచి 25 వరకు స్వీకరించనున్నట్లు టెండర్లలో స్పష్టంచేసింది. సాంకేతిక బిడ్లను 26న, ఆర్థిక బిడ్లను జులై 3న తెరవాలని నిర్ణయించింది. టెండర్లలో అర్హతల ఆధారంగా గుత్తేదారులను ఎంపిక చేయనున్నట్లు టీజీఎండీసీ వర్గాలు తెలిపాయి. ఇసుక తీయనున్న 14 బ్లాక్‌లు మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన కిలోమీటరు నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని ఓ అధికారి తెలిపారు. టెండర్లు పిలిచిన ప్రాంతాల వివరాలు ఇలా ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని