అధికారులను అవమానిస్తున్న కలెక్టర్లపై చర్యలు తీసుకోవాలి

జిల్లా, డివిజన్, మండల స్థాయుల్లో అధికారుల పట్ల అవమానకరంగా, అనుచితంగా ప్రవర్తిస్తున్న కొంత మంది కలెక్టర్లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గెజిటెడ్‌ అధికారుల(టీజీవో) సంఘం డిమాండ్‌ చేసింది.

Published : 17 Jun 2024 04:39 IST

టీజీవోల రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వక్తల డిమాండ్‌

సమావేశంలో మాట్లాడుతున్న టీజీవోల రాష్ట్ర కార్యవర్గ సంఘం అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు. చిత్రంలో సంఘం నాయకులు 

ఈనాడు, హైదరాబాద్‌: జిల్లా, డివిజన్, మండల స్థాయుల్లో అధికారుల పట్ల అవమానకరంగా, అనుచితంగా ప్రవర్తిస్తున్న కొంత మంది కలెక్టర్లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గెజిటెడ్‌ అధికారుల(టీజీవో) సంఘం డిమాండ్‌ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల సాధారణ బదిలీలను కౌన్సెలింగ్‌ విధానంలో వెంటనే చేపట్టాలని, పెండింగ్‌లో ఉన్న 4 డీఏలను విడుదల చేయాలని, ఉద్యోగుల ఆరోగ్య పథకంలో మార్పులు చేసి వెంటనే అమలు చేయాలని కోరింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు అధ్యక్షతన ఆదివారం టీజీవో భవన్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘం నేతలు మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలవుతున్నందున వెంటనే హామీలు అమలు చేయాలని కోరారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని, జీవో 317 దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, పీఆర్‌సీ మధ్యంతర భృతిని 20 శాతానికి పెంచాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని