Ramoji Rao: రామోజీరావు మృతి తెలుగు ప్రజలకు తీరనిలోటు: ఈటల

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు అరుదైన వ్యక్తి అని.. ఆయన మృతి తెలుగు ప్రజలకు తీరని లోటని భాజపా ముఖ్య నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు.

Published : 17 Jun 2024 04:45 IST

రామోజీరావు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌. చిత్రంలో భాజపా నాయకులు
సురేందర్‌ యాదవ్, భద్రయ్య, సామ రంగారెడ్డి, లచ్చిరెడ్డి తదితరులు

ఈనాడు, హైదరాబాద్‌: రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు అరుదైన వ్యక్తి అని.. ఆయన మృతి తెలుగు ప్రజలకు తీరని లోటని భాజపా ముఖ్య నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన రాజీలేని పోరాటం చేశారని చెప్పారు. ప్రతి రంగంలో నాణ్యతే పరమావధిగా పనిచేసి విజయాలు సాధించారని కొనియాడారు. ఆదివారం రామోజీ ఫిల్మ్‌ సిటీలోని నివాసంలో రామోజీరావు చిత్రపటానికి ఈటల రాజేందర్‌ పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం రామోజీరావు తనయుడు, ఈనాడు మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ కిరణ్, మార్గదర్శి మేనేజింగ్‌ డైరెక్టర్‌ శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్‌ సిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ విజయేశ్వరిలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భాజపా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, భాజపా నాయకులు చింతల సురేందర్‌ యాదవ్, నవజీవన్‌రెడ్డి, లచ్చిరెడ్డిలు రామోజీరావుకు నివాళులు అర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని