ఉపాధి పనుల్లో ఐఆర్‌ఎస్‌ అధికారి

పలుగుపట్టి మట్టిని పెకలిస్తున్న ఈయన పేరు సందీప్‌ భాగ. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన ఐఆర్‌ఎస్‌ అధికారి. ప్రస్తుతం బెంగళూరు సౌత్‌ సెంట్రల్‌ ట్యాక్స్‌ కమిషనరేట్‌ జీఎస్‌టీ ఇన్వెస్టిగేషన్‌ విభాగంలో కొన్నేళ్లుగా అసిస్టెంట్‌ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Published : 18 Jun 2024 03:21 IST

పలుగుపట్టి మట్టిని పెకలిస్తున్న ఈయన పేరు సందీప్‌ భాగ. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన ఐఆర్‌ఎస్‌ అధికారి. ప్రస్తుతం బెంగళూరు సౌత్‌ సెంట్రల్‌ ట్యాక్స్‌ కమిషనరేట్‌ జీఎస్‌టీ ఇన్వెస్టిగేషన్‌ విభాగంలో కొన్నేళ్లుగా అసిస్టెంట్‌ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండలం చిల్పకుంట్లలో ఉపాధిహామీ కింద చెరువు పూడికతీత పనులు చేస్తున్నట్లు తెలుసుకుని డీఆర్డీవో అనుమతితో సోమవారం తెల్లవారుజామున అక్కడికి వెళ్లారు. కూలీలతో కలిసి పనిలో నిమగ్నమయ్యారు. పలుగుతో మట్టి తవ్వడం దగ్గర్నుంచి..తట్టలో వేసిన మట్టిని ట్రాక్టర్‌లో నింపడం..ట్రాక్టర్‌లోని మట్టిని రైతు పొలానికి చేర్చడం వరకూ అన్ని పనులూ చేశారు. చేతులు బొబ్బలెక్కినా లెక్కచేయకుండా కొనసాగించారు. కూలీలతో కలిసే భోజనం చేశారు. వారికి అందుతున్న వేతనం, ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ‘కష్టం విలువ నాకు తెలుసు. మరోసారి కూలీల కష్టాలు తెలుసుకోవాలనుకునే ఇలా ఉపాధి పనుల్లో భాగస్వామినయ్యా’ అని సందీప్‌ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

న్యూస్‌టుడే, నూతనకల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని