నాగార్జునసాగర్‌ డ్యాంను పరిశీలించిన కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌

కృష్ణా నదీజలాల నిర్వహణ బోర్డు(కేఆర్‌ఎంబీ) ఛైర్మన్‌ అశోక్‌గోయల్‌ సోమవారం నాగార్జునసాగర్‌ డ్యాంను పరిశీలించారు. కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌గా నూతనంగా నియమితులైన అశోక్‌గోయల్‌ కృష్ణా పరీవాహక ప్రాంతంలోని భారీ ప్రాజెక్టులను పరిశీలిస్తున్నారు.

Published : 18 Jun 2024 03:35 IST

సాగర్‌ ప్రధాన విద్యుత్తు కేంద్రం గురించి తెలుసుకుంటున్న కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌ అశోక్‌గోయల్‌

నాగార్జునసాగర్, న్యూస్‌టుడే: కృష్ణా నదీజలాల నిర్వహణ బోర్డు(కేఆర్‌ఎంబీ) ఛైర్మన్‌ అశోక్‌గోయల్‌ సోమవారం నాగార్జునసాగర్‌ డ్యాంను పరిశీలించారు. కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌గా నూతనంగా నియమితులైన అశోక్‌గోయల్‌ కృష్ణా పరీవాహక ప్రాంతంలోని భారీ ప్రాజెక్టులను పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఆయన సాగర్‌ ప్రధాన డ్యాంతోపాటు క్రస్టుగేట్లు, గ్యాలరీలు, కుడి, ఎడమ కాల్వలు, ప్రధాన విద్యుత్తు కేంద్రాలను పరిశీలించి పలు వివరాలు సేకరించారు. అనంతరం జెన్‌కో విద్యుత్తు కేంద్రంలో అధికారులతో సమావేశమై ఎన్నెస్పీ, ప్రధాన విద్యుత్తు కేంద్రం గురించి చర్చించారు. ఆయన వెంట కేఆర్‌ఎంబీ సభ్యుడు ఆర్‌.ఎన్‌.శంక్హు, ఎస్‌ఈలు వరలక్ష్మి, నాగేశ్వరరావు, డీఈఈ అజయ్‌యాదవ్, ఏఈఈ రాజేశ్‌చారి, ఈఈ మల్లికార్జునరావు, డీఈలు శ్రీనివాసు, కృష్ణయ్య, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని