నీట్‌ పరీక్షను మళ్లీ నిర్వహించాలి: ఐకాస

దేశంలోని లక్షల మంది విద్యార్థులకు అన్యాయం చేస్తూ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీయే) నీట్‌ పేపర్‌ లీకేజీకి పాల్పడిందని పలు విద్యార్థి యువజన సంఘాలతో ఏర్పడిన తెలంగాణ విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆరోపించింది.

Published : 18 Jun 2024 03:36 IST

గోడ పత్రికను ఆవిష్కరిస్తున్న బల్మూరి వెంకట్, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు

ఖైరతాబాద్, న్యూస్‌టుడే: దేశంలోని లక్షల మంది విద్యార్థులకు అన్యాయం చేస్తూ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీయే) నీట్‌ పేపర్‌ లీకేజీకి పాల్పడిందని పలు విద్యార్థి యువజన సంఘాలతో ఏర్పడిన తెలంగాణ విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆరోపించింది. సోమవారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో కమిటీ నిర్వహించిన సమావేశంలో ఎన్‌ఎస్‌యూఐ నేత, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలపై ప్రధాని, మంత్రులు, ఎన్డీయే పక్షాలు స్పందించడంలేదని, దీని వెనుక ఉన్నది వారేనని అర్థమవుతోందన్నారు. పేపర్‌ లీకేజీపై ప్రధాని మోదీ బాధ్యత వహిస్తూ క్షమాపణలు చెప్పి పరీక్షను మళ్లీ నిర్వహించాలని కోరారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలన్నారు. నీట్‌ పరీక్ష నిర్వహణను రాష్ట్రాలకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం తీరును నిరసిస్తూ మంగళవారం హిమాయత్‌నగర్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం వరకు విద్యార్థుల మార్చ్‌ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం ఆయా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ..రాష్ట్రం నుంచి గెలుపొంది కేంద్ర మంత్రులైన వారు నీట్‌ పేపర్‌ లీకేజీపై స్పందించాలన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని