నేడు పీజీఈసెట్‌ ఫలితాలు

రాష్ట్రంలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పీజీఈసెట్‌ ఫలితాలు మంగళవారం సాయంత్రం 4 గంటలకు విడుదల కానున్నాయి.

Updated : 18 Jun 2024 05:51 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పీజీఈసెట్‌ ఫలితాలు మంగళవారం సాయంత్రం 4 గంటలకు విడుదల కానున్నాయి. జేఎన్‌టీయూహెచ్‌లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి తదితరులు ఫలితాలను విడుదల చేస్తారని కన్వీనర్‌ ఎ.అరుణకుమారి ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 20,626 మంది ఈ పరీక్షలు రాయగా నాలుగు రోజుల్లోనే ఫలితాలు ఇస్తుండటం విశేషం. ఫలితాలు ఈనాడు డాట్‌ నెట్, ఈనాడు ప్రతిభ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని