నేను ఇప్పటికీ విద్యార్థినే.. మంత్రినైనా.. ఎల్‌ఎల్‌ఎం చదువుతున్నా..: సీతక్క

ఇప్పటికీ తాను విద్యార్థినేనని, చదువుకు వయసుతో సంబంధం లేదనే విషయాన్ని గుర్తుంచుకుని ముందుకు సాగాలని పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సూచించారు.

Published : 18 Jun 2024 05:49 IST

కురవిలో మాట్లాడుతున్న మంత్రి సీతక్క. చిత్రంలో మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌
అద్వైత్‌ కుమార్‌సింగ్, డోర్నకల్‌ ఎమ్మెల్యే రామచంద్రునాయక్‌ తదితరులు

కురవి, న్యూస్‌టుడే: ఇప్పటికీ తాను విద్యార్థినేనని, చదువుకు వయసుతో సంబంధం లేదనే విషయాన్ని గుర్తుంచుకుని ముందుకు సాగాలని పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సూచించారు. సోమవారం మహబూబాబాద్‌ జిల్లా కురవిలోని గిరిజన ఏకలవ్య గురుకులాన్ని ఆమె సందర్శించారు. ఐఐటీలో సీటు సాధించిన విద్యార్థిని మహేశ్వరిని అభినందించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘పదో తరగతి చదివిన అనంతరం వ్యవస్థ మార్పు కోసం గన్ను పట్టాను. తరువాత సమాజ సేవ కోసం తిరిగి వచ్చాను. ఎల్‌ఎల్‌బీ, పీహెచ్‌డీ పూర్తి చేశా. ఎమ్మెల్యేగా గెలుపొందా. ప్రస్తుతం మంత్రిగా పని చేస్తున్నప్పటికీ.. ఎల్‌ఎల్‌ఎం రెండో సంవత్సరం చదువుతున్నాను. కాంగ్రెస్‌ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నాం’ అని మంత్రి తెలిపారు. ఆమె వెంట మహబూబాబాద్‌ ఎంపీ బలరాంనాయక్, డోర్నకల్‌ ఎమ్మెల్యే రామచంద్రునాయక్, కలెక్టర్‌ అద్వైత్‌ కుమార్‌సింగ్‌ తదితరులు ఉన్నారు. మరిపెడ మండలం లక్ష్మాతండాకు చెందిన బాలిక ఇటీవల హైదరాబాద్‌లో హత్యకు గురికాగా బాధిత కుటుంబసభ్యులను సీతక్క పరామర్శించారు. రూ.50 వేలను తక్షణ సాయంగా అందించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శశాంకతో ఫోన్‌లో మాట్లాడి ఘటనపై వేగంగా విచారణ జరిపించి, నిందితులకు కఠిన శిక్షపడేలా చూడాలని ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని