గొప్ప దార్శనికుడు.. రామోజీరావు: వందేమాతరం శ్రీనివాస్‌

ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌ సిటీ నిర్మాణంతో భారత చలనచిత్ర రంగానికి రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు పెద్ద వరం అందించారని సినీ గాయకుడు, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం రామోజీ ఫిల్మ్‌ సిటీలో రామోజీరావుకు శ్రీనివాస్‌ దంపతులు నివాళులు అర్పించారు.

Updated : 18 Jun 2024 05:51 IST

రామోజీరావుకు నివాళులర్పిస్తున్న వందేమాతరం శ్రీనివాస్‌ దంపతులు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌ సిటీ నిర్మాణంతో భారత చలనచిత్ర రంగానికి రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు పెద్ద వరం అందించారని సినీ గాయకుడు, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం రామోజీ ఫిల్మ్‌ సిటీలో రామోజీరావుకు శ్రీనివాస్‌ దంపతులు నివాళులు అర్పించారు. ఈనాడు ఎండీ సీహెచ్‌ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్‌ సిటీ ఎండీ విజయేశ్వరి, కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీరావు గొప్ప దార్శనికుడని.. ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేరని వందేమాతరం శ్రీనివాస్‌ అన్నారు. ఉషాకిరణ్‌ మూవీస్‌ ద్వారా ఆయన గొప్ప చిత్రాలు అందించారన్నారు. సంగీతం అంటే ఆయనకు ఎంతో ఇష్టమని... ఈనాడు, ఈటీవీ పనుల్లో తీరిక లేకున్నా ‘డాడీ.. డాడీ’ చిత్రం మ్యూజిక్‌ సిట్టింగ్స్‌లో స్వయంగా పాల్గొన్నారని పేర్కొన్నారు.

చిట్‌ఫండ్‌ రంగానికి మార్గదర్శనం చేశారు

చిట్‌ఫండ్‌ రంగంలో రామోజీరావు చూపిన మార్గంలోనే పనిచేసేవాళ్లమని తెలంగాణ చిట్‌ఫండ్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు తెలిపారు. రామోజీ ఫిల్మ్‌ సిటీలోని రామోజీరావు నివాసంలో ఆయనకు వారు నివాళులు అర్పించారు. మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌ను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చిట్‌ఫండ్‌ రంగంలో రామోజీరావు లేని లోటు కనిపిస్తోందని అసోసియేషన్‌ ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆలిండియా చిట్‌ఫండ్‌ అసోసియేషన్, తెలంగాణ చిట్‌ఫండ్‌ అసోసియేషన్‌లకు ఆయన మార్గదర్శనం చేశారని చెప్పారు.

రామోజీ ఫిల్మ్‌ సిటీలో రామోజీరావుకు నివాళులర్పించిన అనంతరం మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌ను
పరామర్శిస్తున్న మార్గదర్శి వైస్‌ ప్రెసిడెంట్‌లు, డైరెక్టర్లు, జనరల్‌ మేనేజర్లు బాలకృష్ణ,ఆదినారాయణ,
బలరాం, వెంకటస్వామి, రాజాజీ, సాంబమూర్తి, మధుసూదన్, రామకృష్ణ, జె.శ్రీనివాస్‌

పలువురి నివాళులు

సోమవారం రామోజీ ఫిల్మ్‌ సిటీలో రామోజీరావుకు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని), కేంద్ర మాజీ మంత్రి పళ్లం రాజు, భాజపా ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన కార్యదర్శి పాతూరి నాగభూషణం, కృష్ణా(విజయ) మిల్క్‌ యూనియన్‌ ఛైర్మన్‌ చలసాని ఆంజనేయులు, రామినేని ధర్మప్రచారక్, మార్గదర్శి వైస్‌ ప్రెసిడెంట్లు రాజాజీ, సాంబమూర్తి, బలరాం, డైరెక్టర్‌ వెంకటస్వామి, సీఓఓ మధుసూదన్, జనరల్‌ మేనేజర్లు బాలకృష్ణ, ఆదినారాయణ, రామకృష,్ణ జె.శ్రీనివాస్‌లు నివాళులు అర్పించినవారిలో ఉన్నారు.

నివాళులర్పిస్తున్న తెలంగాణ చిట్‌ఫండ్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని