హైదరాబాద్‌ చేరుకున్న బండి సంజయ్‌

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ మంగళవారం రాత్రి హైదరాబాద్‌ చేరుకున్నారు.

Published : 19 Jun 2024 04:22 IST

శంషాబాద్, న్యూస్‌టుడే: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ మంగళవారం రాత్రి హైదరాబాద్‌ చేరుకున్నారు. దిల్లీ నుంచి విమానంలో బయల్దేరిన ఆయన రాత్రి 10.20 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగారు. వీవీఐపీ ద్వారం నుంచి హంగూ ఆర్భాటం లేకుండా సాదాసీదాగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ నివాసానికి వెళ్లిపోయినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని