కడెం అడవుల్లో అరుదైన కప్ప

నిర్మల్‌ జిల్లా కడెం మండలం ఉడుంపూర్‌ రేంజ్‌ పరిధిలోని పెద్దవాగు పరిసరాల్లో మంగళవారం అటవీ అధికారులు అరుదైన జాతి రకం కప్పను గుర్తించారు.

Published : 19 Jun 2024 05:18 IST

కడెం, న్యూస్‌టుడే: నిర్మల్‌ జిల్లా కడెం మండలం ఉడుంపూర్‌ రేంజ్‌ పరిధిలోని పెద్దవాగు పరిసరాల్లో మంగళవారం అటవీ అధికారులు అరుదైన జాతి రకం కప్పను గుర్తించారు. కవ్వాల్‌ పెద్దపులుల సంరక్షణ కేంద్రం పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో కల్లెడ డీఆర్వో ప్రకాష్, ఎఫ్‌బీఓ ప్రసాద్‌లు గస్తీ తిరుగుతుండగా ఈ కప్ప కనిపించడంతో ఫొటోలు తీశారు. ఇండియన్‌ పెయింటెడ్‌ ఫ్రాగ్, శ్రీలంక బుల్‌ఫ్రాగ్‌ పేర్లతో పిలిచే ఈ కప్ప చాలా తక్కువ ప్రాంతాల్లో కనిపిస్తుందని డీఆర్వో తెలిపారు. ఈ కప్పలు వేసవిలో చల్లని ప్రదేశాల్లో నేల లోపలి భాగంలో ఉండి.. వర్షాకాలం ఆరంభంతో బయటకు వచ్చి గుడ్లు పెడతాయన్నారు. దట్టమైన అటవీ ప్రాంతం, జీవవైవిధ్యం ఉన్నచోటనే ఇవి జీవిస్తాయని వెల్లడించారు. మొదటిసారి కవ్వాల్‌ అటవీ ప్రాంతంలో ఈ కప్ప కనిపించడంతో అటవీశాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని