మంచిర్యాలలో గాలివాన బీభత్సం

మంచిర్యాల జిల్లాలో మంగళవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. చెన్నూరు మండలంలోని అస్నాద్‌ గ్రామంలో ఈదురుగాలులకు పలు ఇళ్లు, దుకాణాలపై ఉన్న రేకులు ఎగిరిపోయాయి.

Published : 19 Jun 2024 05:20 IST

మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం అస్నాద్‌లోని ప్రధాన రోడ్డుపై విరిగిపడిన విద్యుత్తు స్తంభాలు

చెన్నూరు గ్రామీణం, జైపూర్, న్యూస్‌టుడే: మంచిర్యాల జిల్లాలో మంగళవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. చెన్నూరు మండలంలోని అస్నాద్‌ గ్రామంలో ఈదురుగాలులకు పలు ఇళ్లు, దుకాణాలపై ఉన్న రేకులు ఎగిరిపోయాయి. ప్రధాన రహదారి పక్కన ఉన్న విద్యుత్తు స్తంభాలు నేలకొరిగి తీగలు తెగిపడ్డాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామంలో విద్యుత్తు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. జైనూరు మండలంలోని పౌనూర్‌లో పిడుగుపాటుకు ఎల్లమ్మ దేవాలయం సమీపంలోని తాటివనంలో రెండు చెట్లు దగ్ధమయ్యాయి.

జైపూర్‌ మండలం పౌనూర్‌లో పిడుగుపాటుకు కాలిపోతున్న తాటిచెట్టు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని