ఇందిరమ్మ గృహాల నిర్మాణాల్లో అక్రమాలు.. ఇద్దరు ఏఈలకు మూడేళ్ల జైలుశిక్ష

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో ఇందిరమ్మ గృహాల నిర్మాణాల్లో అక్రమాలకు పాల్పడిన ఏఈలు సంపత్‌కుమార్, భిక్కులాల్‌లతో పాటు సిబ్బంది వజ్రమ్మ, రాజమణిలకు ఎల్లారెడ్డి కోర్టు న్యాయమూర్తి హారిక మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.పదివేల జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు వెల్లడించారు.

Published : 20 Jun 2024 05:09 IST

లింగంపేట, న్యూస్‌టుడే: కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో ఇందిరమ్మ గృహాల నిర్మాణాల్లో అక్రమాలకు పాల్పడిన ఏఈలు సంపత్‌కుమార్, భిక్కులాల్‌లతో పాటు సిబ్బంది వజ్రమ్మ, రాజమణిలకు ఎల్లారెడ్డి కోర్టు న్యాయమూర్తి హారిక మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.పదివేల జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు వెల్లడించారు. 2009లో మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన ఇందిరమ్మ గృహాల నిర్మాణాలతో పాటు బిల్లుల చెల్లింపులో అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ జరగడంతో గృహ నిర్మాణశాఖ అధికారులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరు ఏఈలతో పాటు కార్యాలయ సిబ్బందిపై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీటును పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం పదిహేనేళ్ల అనంతరం అక్రమార్కులకు శిక్షలను ఖరారు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని