సీఎం ఆదేశించినా ఐఆర్‌పై నిర్ణయం తీసుకోలేదు

రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు వేతన సవరణ కమిషన్‌లోని మధ్యంతర భృతి (ఐఆర్‌) ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించినా ఇప్పటివరకు అమలు చేయలేదని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల సమాఖ్య ఫిర్యాదుచేసింది.

Published : 20 Jun 2024 05:13 IST

భట్టికి ప్రభుత్వరంగ సంస్థ ఉద్యోగుల సమాఖ్య ఫిర్యాదు

ఈనాడు, హైదరాబాద్‌ : రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు వేతన సవరణ కమిషన్‌లోని మధ్యంతర భృతి (ఐఆర్‌) ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించినా ఇప్పటివరకు అమలు చేయలేదని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల సమాఖ్య ఫిర్యాదుచేసింది. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అభ్యర్థించింది. సమాఖ్య నేతలు బుధవారం సచివాలయంలో భట్టిని కలిసి ఐఆర్‌ వర్తింపులో తమకు జరుగుతున్న జాప్యంపై వినతిపత్రం సమర్పించారు. గత అక్టోబరులో జారీ చేసిన పీఆర్‌సీ ఉత్తర్వుల్లో  ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులను చేర్చలేదని,  దీనిని కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశాక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఫిబ్రవరిలో కలిసి తాము విన్నవించామని తెలిపారు. దీనిపై సీఎం స్పందించి వెంటనే ఆర్థికశాఖకు నోట్‌ పంపించాలని తమ కార్యదర్శిని ఆదేశించారని, అదే నెలలో సీఎం కార్యాలయ కార్యదర్శి నుంచి ఆర్థికశాఖకు నోట్‌ అందిందని తెలిపారు. ఫిబ్రవరి నుంచి దీనిపై ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించాలని వారు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని