నిరసన తెలపడం నేరం కాదు

శాంతియుతంగా బహిరంగ ప్రదేశాల్లో నిరసన వ్యక్తం చేయడం నేరమేమీ కాదంటూ తెలంగాణ విద్యార్థి వేదిక సభ్యులపై పెట్టిన కేసును హైకోర్టు కొట్టివేసింది.

Published : 20 Jun 2024 05:13 IST

తెలంగాణ విద్యార్థి వేదిక సభ్యులపై కేసును కొట్టేసిన హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: శాంతియుతంగా బహిరంగ ప్రదేశాల్లో నిరసన వ్యక్తం చేయడం నేరమేమీ కాదంటూ తెలంగాణ విద్యార్థి వేదిక సభ్యులపై పెట్టిన కేసును హైకోర్టు కొట్టివేసింది. 2019 మే 17 నాడు పౌరహక్కుల సంఘాలకు చెందిన ప్రొఫెసర్‌ సాయిబాబా, వరవరరావులను విడుదల చేయాలంటూ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద అనుమతిలేకుండా నిరసన వ్యక్తం చేశారంటూ 13 మందిపై సైఫాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ విద్యార్థి వేదిక సభ్యులు కొత్తపల్లి మహేశ్, తంగెళ్ల సూర్య, సాహితి, కొత్తపల్లి అనిల్, బంటు సాగర్‌కుమార్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. దీనిపై జస్టిస్‌ కె.సుజన విచారణ చేపట్టిన న్యాయమూర్తి పిటినర్లు నిరసన వ్యక్తం చేయడం ద్వారా శాంతి భద్రతలకు భంగం కలిగించినట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. శాంతియుతంగా, ప్రజాజీవనానికి ఇబ్బందిలేకుండా ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే హక్కు పిటిషనర్లకు ఉందని పేర్కొన్నారు. అందువల్ల పిటిషనర్లపై కేసు పెట్టడం చెల్లదంటూ, వారిపై ఉన్న కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని