జర్నలిస్టుల అక్రిడిటేషన్‌ గడువు పొడిగింపు

రాష్ట్రంలో వర్కింగ్‌ జర్నలిస్టుల అక్రిడిటేషన్‌(గుర్తింపు కార్డు) గడువును మరో మూడు నెలల (సెప్టెంబరు 30)వరకు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్‌ కమిషనర్‌ హనుమంతరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Published : 20 Jun 2024 05:14 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో వర్కింగ్‌ జర్నలిస్టుల అక్రిడిటేషన్‌(గుర్తింపు కార్డు) గడువును మరో మూడు నెలల (సెప్టెంబరు 30)వరకు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్‌ కమిషనర్‌ హనుమంతరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు అక్రిడిటేషన్‌ కార్డుల గడువు పొడిగింపుపై తగు చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వర్కింగ్‌ జర్నలిస్టుల కోసం ప్రతి రెండేళ్లకోసారి అక్రిడిటేషన్‌ కార్డుల సదుపాయం రాష్ట్ర సమాచార శాఖ కల్పిస్తోంది. ఆ గడువు జూన్‌ 30తో ముగుస్తుండటంతో దానిని సెప్టెంబరు 30 వరకు పొడిగించినట్లు ఉత్తర్వుల్లో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని