పీఈసెట్‌ ఉత్తీర్ణులు 1,645 మంది

రాష్ట్రంలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌(బీపీఎడ్‌), డిప్లొమా ఇన్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌(డీపీఎడ్‌) సీట్ల భర్తీకి నిర్వహించిన పీఈసెట్‌లో మొత్తం 1,645 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ పరీక్షలో భాగంగా ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు.

Published : 20 Jun 2024 05:14 IST

మొత్తం సీట్లు 1,660

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌(బీపీఎడ్‌), డిప్లొమా ఇన్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌(డీపీఎడ్‌) సీట్ల భర్తీకి నిర్వహించిన పీఈసెట్‌లో మొత్తం 1,645 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ పరీక్షలో భాగంగా ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. మొత్తం 2,392 మంది దరఖాస్తు చేయగా 1,705 మంది హాజరయ్యారు. వారిలో 1,645 మంది(96.48 శాతం) పాసయ్యారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, శాతవాహన విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జి వీసీ, ఐఏఎస్‌ అధికారి సురేంద్ర మోహన్‌ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా లింబాద్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 14 బీపీఎడ్‌ కళాశాలల్లో 1,360 సీట్లు, మూడు డీపీఎడ్‌ కళాశాలల్లో 300 సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఉత్తీర్ణులైన వారిలో 942 మంది అబ్బాయిలు, 703 మంది అమ్మాయిలున్నారు. రెండు విభాగాల్లోని తొలి 10 మంది టాపర్లలో తొమ్మిది మంది అమ్మాయిలే నిలిచారన్నారు. బీపీఎడ్‌లో మహబూబ్‌నగర్‌ జిల్లా వెల్కిచర్లకు చెందిన గొల్ల మహేశ్వరి, డీపీఎడ్‌లో భువనగిరి జిల్లా అమ్మనబోల్‌కు చెందిన చిట్టిమల్ల సంధ్య ప్రథమ ర్యాంకర్లుగా నిలిచారు. కార్యక్రమంలో విద్యామండలి ఉపాధ్యక్షులు వెంకటరమణ, ఎస్‌కే మహమూద్, కార్యదర్శి ఆచార్య శ్రీరాం వెంకటేశ్, కన్వీనర్‌ రాజేశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

అధిక శాతం అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ ద్వారానే సీట్లు

రాష్ట్రంలోని మొత్తం సీట్లలో 25 శాతం యాజమాన్య కోటా సీట్లు తీసివేసినా కన్వీనర్‌ కోటా కింద 1,245 వరకు ఉంటాయి. అంటే పాసైన వారిలో అధిక శాతం మందికి కౌన్సెలింగ్‌ ద్వారానే సీట్లు లభించనున్నాయి. మొత్తం పాసైన వారిలో కేవలం 22 మంది మాత్రమే ఓసీలున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని