సుప్రీంకోర్టులోని కేసులపై ప్రత్యేక లోక్‌అదాలత్‌

సుప్రీంకోర్టులోని పెండింగ్‌ కేసుల పరిష్కారానికి ప్రత్యేకంగా లోక్‌అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ మెంబర్‌ సెక్రటరీ సీహెచ్‌.పంచాక్షరి బుధవారం వెల్లడించారు.

Published : 20 Jun 2024 05:17 IST

ఈనాడు, హైదరాబాద్‌: సుప్రీంకోర్టులోని పెండింగ్‌ కేసుల పరిష్కారానికి ప్రత్యేకంగా లోక్‌అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ మెంబర్‌ సెక్రటరీ సీహెచ్‌.పంచాక్షరి బుధవారం వెల్లడించారు. సుప్రీంకోర్టులో మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించడానికి అనువైన కేసులు దాదాపు 295 దాకా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇందులో కార్మిక, కుటుంబ వివాదం, సర్వీసు, చెక్‌బౌన్స్, మోటారు వాహనాల చట్టాలకు చెందినవి ఉన్నాయన్నారు. ఈ కేసుల్లో ఇప్పటికే కక్షిదారులకు నోటీసులు జారీ చేశామని, వారు ముందుకు వస్తే లోక్‌అదాలత్‌లో కేసులను పరిష్కరిస్తామన్నారు. ఒకవేళ ఇరుపార్టీలు అంగీకరించి ఒప్పందానికి వచ్చినట్లయితే ఒప్పంద పత్రాన్ని సుప్రీంకోర్టుకు పంపడం ద్వారా అవార్డు జారీ చేసి కేసును పరిష్కరిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని