జులై 2 నుంచి రామయ్య సన్నిధిలో బ్రేక్‌ దర్శనాలు

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జులై 2వ తేదీ నుంచి బ్రేక్‌ దర్శనాలు కల్పిస్తున్నట్లు ఈఓ రమాదేవి బుధవారం తెలిపారు.

Published : 20 Jun 2024 05:18 IST

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జులై 2వ తేదీ నుంచి బ్రేక్‌ దర్శనాలు కల్పిస్తున్నట్లు ఈఓ రమాదేవి బుధవారం తెలిపారు. రూ.200 రుసుముపై ప్రతీ రోజు ఉదయం 9 నుంచి 9.30 వరకు, రాత్రి 7 నుంచి 7.30 వరకు ఈ సదుపాయం ఉంటుందన్నారు. భక్తులు మూలవిరాట్‌ దర్శనంతోపాటు అర్చకులు అందించే హారతి దర్శనం చేసుకోవచ్చన్నారు. రోజులో గంటసేపు కల్పించనున్న బ్రేక్‌ దర్శన సదుపాయంతో వందల మందికి ప్రయోజనం కలగనుంది. ముఖ్యమైన ఉత్సవాలు, విశేష కార్యక్రమాల సమయంలో బ్రేక్‌ దర్శనం రద్దు లేదా వాయిదా వేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని